: తిరుమలలో భక్తుల తీవ్ర ఇబ్బందులు... చేతిలో డబ్బున్నా టిఫిన్ చెయ్యలేని దుస్థితి!


పెద్ద నోట్ల రద్దు తరువాత తిరుమలలో దేవదేవుని దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యమూ లక్ష్మీదేవి పద సవ్వడులతో కళకళలాడే తిరుమల కళ తప్పింది. తిరుమలకు వచ్చే భక్తుల వద్ద రూ. 500, రూ. 1000 నోట్లు తప్ప వంద రూపాయల నోట్లు పెద్దగా ఉండవు. ఈ ఉదయం నుంచి ఏ సేవకు టికెట్ పొందాలన్నా వంద రూపాయల నోట్లు మాత్రమే చెల్లుతాయని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తుండటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కౌంటర్లలో సేవా టికెట్ల జారీ నిలిచిపోయింది. అదృష్టవంతులు ఎవరి వద్దనైనా వంద రూపాయల నోట్లుంటే వారికి మాత్రమే సేవలందుతున్నాయి. హోటళ్లలో సైతం ఈ నోట్లను స్వీకరించడం లేదు. చేతినిండా డబ్బున్నా కనీసం పిల్లలకు టిఫిన్ కూడా పెట్టించలేని స్థితిలో ఉన్నామని భక్తులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News