: టెన్నిస్ రారాజుగా కీర్తినందుకున్న ఆండీ ముర్రే


ప్రపంచ పురుషుల సింగిల్స్ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌ లో బ్రిటన్‌ స్టార్ ఆండీ ముర్రే (29) వరల్డ్ నెం.1 ర్యాంకును సొంతం చేసుకుని జకోవిచ్ స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఆండీ ముర్రేకు జకోవిచ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. ఎన్నో కష్టాలనోర్చి మైలురాయిని చేరుకున్నందుకు శుభాకాంక్షలు చెబుతున్నట్లు జకోవిచ్‌ ట్వీట్‌ చేశాడు. ఆటపట్ల ఏకాగ్రత, పట్టుదల ఆండీ ముర్రేను ఈ స్థాయికి తీసుకొచ్చాయని జకోవిచ్ పేర్కొన్నాడు. కాగా, గత 122 వారాలుగా మొదటిస్థానంలో ఉన్న సెర్బియా స్టార్ నోవక్‌ జకోవిచ్‌ క్రమంగా ఫాం కోల్పోయాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజయాలతో ఆరంభించిన జకోవిచ్‌ ఆదే ఫాం కొనసాగించడంలో విఫలమయ్యాడు. జకోవిచ్ ఫాం కోల్పోతున్న క్రమంలో ఆండీ ముర్రే తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకోగలిగాడు. దీంతో తాజాగా పారిస్‌ మాస్టర్స్‌ కప్‌ సొంతం చేసుకున్న ముర్రే ఈ ఏడాదిలో ఎనిమిదో టైటిల్‌ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News