: వింత... తమిళనాట ఏడు కాళ్ల లేగదూడ జననం


తమిళనాట వింత లేగదూడ జన్మించింది. ఈరోడ్ జిల్లాలో అంధియూర్‌ కు చెందిన చిన్నస్వామి అనే రైతు ఐదు పాడిపశువుల్లో ఓ జెర్సీ ఆవు ఏడు కాళ్లతో వున్న వింత లేగదూడకు జన్మనిచ్చింది. సహజంగా నాలుగు కాళ్లు ఉండాల్సిన దూడకు ఏడు కాళ్లు ఉండడంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు బారులు తీరుతున్నారు. దీంతో ఆవు యజమాని చిన్నస్వామి బర్గూర్‌ పశుసంవర్ధక కేంద్ర వైద్యుడు కుమరవేల్‌ కు సమాచారం అందించారు. ఆయన వచ్చి దూడను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో రెండు తలలతో దూడలు జన్మించడం సహజమని అన్నారు. అయితే ఏడు కాళ్లతో దూడ జన్మించడం మాత్రం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. దీనిని పరిశోధనల కోసం పశుసంవర్ధక వైద్యకళాశాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దీంతో నామక్కల్‌ వెటర్నరీ వైద్యకళాశాల పరిశోధన కేంద్రానికి ఏడు కాళ్ల లేగదూడను తరలించారు.

  • Loading...

More Telugu News