: జెడ్డాలో సంచలన తీర్పు... 7,000 కొరడా దెబ్బలు, 52 ఏళ్ల జైలు శిక్ష!


దోపిడీకి వచ్చిన దొంగలు చేసిన దారుణానికి సౌదీ అరేబియాలోని జెద్దా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జెడ్డాలోని ఓ నివాసంలోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఆ నివాసంలోని 10 వేల రియాళ్లు, 8 మొబైల్‌ ఫోన్లు దొంగిలించి పారిపోయారు. వస్తువులు పోయాయని ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉండగానే వెనక్కి వచ్చిన నలుగురు దొంగలు, ఇంటి యజమాని, అతని కుమార్తెను విద్యుత్ తీగలతో బంధించారు. భర్త, కుమార్తె కళ్లముందే అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కఠిన శిక్షలు అమల్లో ఉండే సౌదీలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు. దీంతో దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం దోషులకు ఏకంగా 52 ఏళ్ల జైలు శిక్ష, 7,000 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. ఒకరికి 50 దఫాలుగా 2,500 కొరడా దెబ్బలతో పాటు 17 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. మరో ఇద్దరికి 1,500 చొప్పున కొరడా దెబ్బలతో పాటు 15 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. నాలుగో వ్యక్తికి 1,500 కొరడా దెబ్బలు, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News