: ముగిసింది ప్రత్యేకహోదా అధ్యాయం కాదు.. టీడీపీ, బీజేపీల బాగోతం: రఘువీరారెడ్డి
ముగిసింది ప్రత్యేకహోదా అధ్యాయం కాదని, టీడీపీ, బీజేపీల బాగోతమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. నవ్యాంధ్రలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా అధ్యాయం ముగిసిందని చెప్పడానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి నోరెలా వచ్చిదంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మార్కెటింగ్ ఏజెంట్ గా, రాష్ట్ర ప్రభుత్వానికి సీఈఓ గా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడు దిగజారిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ పార్టీల్లోకి వెళ్లే వారి పరిస్థితి సాలెపురుగు గూడులో పడ్డ పురుగుల లాగానే ఉంటుందని అభివర్ణించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. చిరంజీవి తన 150వ చిత్రంలో బిజీగా ఉన్నారని, అందుకే, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అన్నారు.