: టీడీపీ పోరు యాత్ర ఓ డ్రామా: తెలంగాణ మంత్రి జూపల్లి


టీడీపీ పోరుయాత్రపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పుడు పోరుయాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. టీడీపీది బూటకపు యాత్ర అని, పోరుయాత్ర పేరిట టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఉచితంగా ఇస్తోందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోస్తోందని అన్నారు. టీడపీ, కాంగ్రెస్ హయాంలో 35 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రైతులను ఆదుకునేందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలన్న ఆలోచన దశాబ్ద కాలం అధికారంలో ఉన్న టీడీపీకి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల కోసం మిషన్ కాకతీయ చేపట్టి చెరువులు నిండేలా చేసిన టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News