: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2 నోటిఫికేషన్ కు సర్వం సిద్ధం
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఈరోజు లేదా రేపు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు చెప్పారు. గ్రూప్-2 కు సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తవుతుందని, 950 నుంచి వెయ్యి పోస్టులు భర్తీ చేయనున్నామని చెప్పారు. ఈ డిసెంబర్ లోగా గ్రూప్-1, గ్రూప్-3కు నోటిఫికేషన్లు కూడా రానున్నాయని చెప్పారు.