: 5 లక్షలు ఇచ్చినా బ్లాక్ మెయిల్ ఆపని బీటెక్ విద్యార్థి అరెస్టు
సోషల్ మీడియా వేదికగా వేధింపులు పెరిగిపోతున్నాయి. సికింద్రాబాద్ లోని చిలకలగూడలో నివాసం ఉంటున్న ఆకాశ్ రెడ్డి బీటెక్ చదువుతున్నాడు. ఈ మధ్యే ఫేస్ బుక్ లో ఆకాశ్ రెడ్డికి ఓ యువతి పరిచయమైంది. ఆమెతో ఛాటింగ్ మొదలుపెట్టాడు. ఇది కాస్త శ్రుతిమించడంతో ఆమెను లొంగదీసుకునేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆందోళనకు గురైన యువతి, చదువు కోసం దాచుకున్న 5 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి పీడవిరగడైందని భావించింది. అయితే '5 లక్షలు ఇచ్చిన అమ్మాయి, ఇంకా ఏమడిగినా ఇస్తుంద'ని భావించిన ఆకాశ్ రెడ్డి మళ్లీ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆకాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.