: నా జీవితంలో చాలా బాధాకరమైన పుట్టినరోజు అది!: కమలహాసన్


‘నా 16వ పుట్టినరోజు నాకు అత్యంత బాధాకరమైనది’ అని ప్రముఖ నటుడు కమలహాసన్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కమల్, తాను వేరుపడ్డట్లు గౌతమి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘62వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మీకు ఈ పుట్టినరోజు అత్యంత బాధాకరమైనదా?' అనే ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ, ‘కాదు, ఎందుకంటే, నా 16వ పుట్టినరోజు సమయానికి నాకు ఒక లక్ష్యం, దిశా నిర్దేశం లేకుండా ఉన్నాను. అప్పుడు, మా నాన్నగారు నాకు క్లాసు పీకారు. నాకు బాగా గుర్తుంది.. నా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని గట్టిగా ఏడ్చాను. నా పుట్టినరోజు నాడు నేను ఏడ్చినటువంటి ఒకే ఒక సందర్భం ఇది. అందుకే బాగా అన్ హ్యాపీ పుట్టినరోజది’ అంటూ నాటి విషయాలను కమల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కాలికి మల్టీ ఫ్యాక్చర్ కారణంగా తీవ్రంగా బాధపడుతున్నానని, నిన్నటి నుంచి నరాలకు సంబంధించి కూడా ఇబ్బంది మొదలైందని, ఈ బాధ తట్టుకోలేకపోతుండటంతో వైద్యుడి సలహాతో రోజులో ఎక్కువ భాగం మత్తు మందులు వేసుకోకతప్పడం లేదన్నారు. ఒకవైపు కాలి బాధ, మరోవైపు బయట తిరగలేకపోతున్నాననే బాధగా ఉందన్నారు. ‘సరిగా నడవలేకపోతున్న నేను ఒక కాలితో కుంటుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం బాగుండదు. దాని బదులు నా గదిలో కూర్చోవడం మంచిది. అందుకే నా పుట్టినరోజు వేడుకలను నిర్వహించటం లేదు. వేరే కారణాలు ఏమీ లేవు’ అంటూ కమల్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News