: ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండి: కేంద్రానికి సుప్రీం అల్టిమేటం


దేశ రాజధాని న్యూఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్య తీవ్రతను తగ్గించడంలో ప్రభుత్వ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ ను విచారించిన సందర్భంగా, ప్రస్తుత పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ ను 48 గంటల్లో తమకు తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీలో అత్యంత భయానకంగా, తీవ్ర విపత్కర స్థాయిలో వాతావరణ కాలుష్యం తాండవిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి విధానపరమైన చర్యలు చేపట్టనున్నారో 48 గంటల్లోగా వివరించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. దీపావళి పండుగ అనంతరం ఏర్పడిన కాలుష్యం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గి తీవ్ర కాలుష్యం ఆవరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు సునీతా నాయర్‌, వాతావరణ కాలుష్య నియంత్రణ సంస్థ (ఈపీసీఏ) పేర్కొన్న సూచనలను సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

  • Loading...

More Telugu News