: సౌతాఫ్రికాలో వెలుగు చూసిన జాత్యహంకార దురాగతం!


సౌతాఫ్రికాలో వెలుగు చూసిన జాత్యహంకార దురాగతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నల్ల జాతీయుడి పట్ల తెల్లజాతీయుల దురహంకారానికి పరాకాష్టగా నిలుస్తున్న ఈ ఘటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నేరం చేశాడనే ఆరోపణతో నల్లజాతికి చెందిన ఓ యువకుడిని ఇద్దరు తెల్లజాతీయులు శవపేటికలో బలవంతంగా పడుకోబెట్టారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆ నల్లజాతీయుడు శవపేటికలో నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించగా, అతని ప్రయత్నాన్ని ఆ ఇద్దరు తెల్లజాతీయులు పాశవికంగా అడ్డుకున్నారు. ఒకరు శవపేటికను మూసేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కనే ఉన్న మరో తెల్లజాతీయుడు శవపేటికలోకి పామును పంపిస్తానని, పెట్రోలు పోసి తగులబెడతానని భయపెడుతున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. మీరు కూడా ఆ దారుణాన్ని చూడండి.

  • Loading...

More Telugu News