: బెంగళూరులో బ్రిటన్ ప్రధాని థెరిసా మే పర్యటన.. సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి, పూజల్లో పాల్గొన్న థెరిసా మే
భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఈ రోజు మధ్యాహ్నం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. స్టోనహళ్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆమె.. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా థెరిసా మేను సిద్ధరామయ్య కొత్త వీసా పాలసీ అంశాన్ని పునఃసమీక్షించాలని కోరారు.