: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు: ట‌్రంప్‌, హిల్ల‌రీ క్లింట‌న్ మ‌ధ్య హోరా హోరీ పోరు.. అట్లాంటిక్ తీర ప్రాంత రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన పోలింగ్


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తుది పోలింగ్ ప్రారంభ‌మైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింట‌న్ మ‌ధ్య పోరు నువ్వా? నేనా? అన్న‌ట్లుగా కొన‌సాగుతోంది. అమెరికాలోని టైమ్‌జోన్ల తేడా వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే పోలింగ్ ప్రారంభం అయి ఫలితాలు వెలువడగా, అట్లాంటిక్ తీర ప్రాంత రాష్ట్రాల్లో కొద్ది సేప‌టి క్రితం పోలింగ్ ప్రారంభ‌మైంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓట‌ర్లు బారులు తీరి క‌నిపిస్తున్నారు. కీల‌క రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఓట్ల‌పై స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది. ఒక్కో రాష్ట్రంలో 12 గంట‌ల పాటు పోలింగ్ కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టికే న్యూహ్యాంప్‌షైర్‌లో డొనాల్డ్ ట్రంప్‌ పైచేయి సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించేది హిల్లరీ క్లింటనేనని ఎన్నో సర్వేలు చెప్పగా, డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువేనని మరికొందరు విశ్లేషించారు. రేపు సాయంత్రం తుది ఫలితం తెలియనుంది.

  • Loading...

More Telugu News