: నౌషెరా సెక్టార్ వద్ద ఉదయం నుంచి ఆగని కాల్పులు... వీరమరణం పొందిన భారత జవాను
పాకిస్థాన్ బలగాలు బుద్ధిని మార్చుకోవడం లేదు. పదే పదే కాల్పులకు తెగబడుతూ భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి జమ్ముకశ్మీర్ రాజౌరిలోని నౌషెరా సెక్టార్ వద్ద పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఓ జవాను వీరమరణం పొందాడు. మరో జవానుకి గాయాలయినట్లు తెలుస్తోంది. కాల్పులను భారత జవాన్లు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.