: విజయవాడలోని జయశ్రీ లిబర్టీ ఆసుపత్రి వద్ద ఆందోళన


రోగితో వైద్యుడు అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో విజయవాడలోని జయశ్రీ లిబర్టీ ఆసుపత్రి వద్ద ఆందోళన నెలకొంది. ఆసుపత్రిలోని రోగితో సదరు వైద్యుడు అమర్యాదగా ప్రవర్తించారంటూ రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అద్దాలపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు బందరు రోడ్డుపైకి చేరి తమ నిరసన వ్యక్తం చేస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణలు చెప్పేవరకు తమ నిరసన కొనసాగుతుందని రోగి బంధువులు అంటున్నారు.

  • Loading...

More Telugu News