: వెంకయ్య నాయుడిపై అంబటి రాంబాబు విసుర్లు
ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్న వారు అప్పుడు ఏం చేశారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని ఆయన అన్నారు. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ విశాఖలో 'జై ఆంధ్రప్రదేశ్' సభను నిర్వహించామని... ఆ సభ పూర్తిగా విజయవంతం కావడంతో, వెంకయ్య విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశం అని వెంకయ్య నాయుడు అనడం సరైంది కాదని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ అధినేత జగన్ విశ్రమించరని స్పష్టం చేశారు.