: ‘లైన్ క్లియర్’.. బీసీసీఐకి సుప్రీంకోర్టులో ఊరట.. యథాతథంగా రేపటి భారత్-ఇంగ్లండ్ మొదటి టెస్టు మ్యాచ్
లోథా కమిటి ప్రతిపాదనలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న బీసీసీఐ నిధులు విడుదల చేసే విషయంలో తమకు అధికారం లేకపోవడంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న భారత్ - ఇంగ్లండ్ మొదటి మ్యాచ్ ను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమ గోడును తెలుపుతూ బీసీసీఐ ఈ రోజు ఉదయం తమకు సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. వెంటనే రాజ్‌కోట్ టెస్టు మ్యాచుకు రూ. 58.66 లక్షలు విడుదల చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపటి మ్యాచ్‌పై సందిగ్ధత తొలగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మొదటి టెస్టు మ్యాచు జరగనుంది.