: నాలుగు ఉద్యోగాలు పొందిన కేసీఆర్ కుటుంబం... ఎంతమందికి ఉద్యోగాలిచ్చింది?: లక్ష్మణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీబీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. నాలుగు ఉద్యోగాలు పొందిన కేసీఆర్ కుటుంబం... రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతసేపూ తన కుటుంబ సంక్షేమమే తప్ప... రైతుల సంక్షేమం కేసీఆర్ కు పట్టదని ఆయన ఆరోపించారు. వెంటనే రూ. 8 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి ప్రాంతంలో ప్రవహిస్తున్న మూసీ నదిని వెంటనే ప్రక్షాళన చేయాలని విన్నవించారు. ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కలిపి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని కోరారు.