: 300 కోడిగుడ్లతో కూర వండిన వ్యక్తి.. యూట్యూబ్ లో క్లిక్కులే క్లిక్కులు!


త‌మిళనాడులో 300 కోడిగుడ్లతో తేలిక‌గా కూర‌ వండేసిన ఓ వ్య‌క్తి వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాను చేస్తోన్న వంట‌ని త‌న‌ మాతృభాషలో వివరించాడు. ఈ వంట చూస్తోన్న నెటిజ‌న్లకు ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌డంతో పాటు నోరూ ఊరుతోంది. ఆ వ్య‌క్తి పేరేమిటో తెలియ‌దు కానీ, గ్యాస్ పొయ్యిపై కాకుండా ఇటుకల పొయ్యిమీదే వంట‌కాలు వండి చూపిస్తున్నాడు. ‘విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ అనే యూట్యూబ్ ఛానెల్ లో త‌న వంట‌కాల గురించి వివరిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నాడు. 300 గుడ్లతో కూర వండాక, అరటాకులో పెట్టుకొని తిన్నాడు. మిగిలిన కూరను కుక్క పిల్లలకు పెట్టాడు. ఈ నెల 4వ తేదీన ఆయ‌న వండిన 300 కోడిగుడ్ల కూరను నెటిజ‌న్లు విప‌రీతంగా చూసేస్తున్నారు. ఆ వీడియోకు ఇప్పటివరకు 20 లక్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ‘విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ యూ ట్యూబ్ ఛానెల్ గ‌త ఏడాది ప్రారంభ‌మైంది. గ్రామీణ ప్రాంత‌ వంటకాలను ఈ ఛానెల్‌లో ఉంచుతున్నారు. తమిళనాడేకాదు, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి అనేక ప్ర‌దేశాల్లో అక్కడి గ్రామీణ ప్రాంత వాసులు వంట‌కాల‌ను ఇందులో చూడ‌వచ్చు. తాజాగా 300 కోడిగుడ్ల కూర చేసిన త‌మిళ‌నాడు వ్య‌క్తికి సంబంధించిన చేపల కూర, మేక మాంసం కూర, పీతలు వంటి ప‌లు వీడియోలు చూస్తుంటేనే నెటిజ‌న్ల చ‌వులూరుతున్నాయి. ఈ వ్యక్తికి వంటలో త‌న కుమారులు సాయం చేసి ఆ వీడియోలు యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News