: టికెట్ ఇస్తామని చెప్పి మహిళపై ఆప్ నేతల సామూహిక అత్యాచారం.. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు


పంజాబ్‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేసి అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీకి మ‌రిన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఎన్నికల్లో టికెట్ ఇస్తామ‌ని చెప్పి త‌న‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఓ మ‌హిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం అలజడి రేపుతోంది. ఆ పార్టీ నేత‌లు రామ్ ప్రసాద్ గోయల్, భూపేంద్రలు ఈ దారుణానికి పాల్పడ్డారని ఢిల్లీ వాసురాలయిన బాధిత మ‌హిళ‌ రోహిణీ సౌత్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్ర‌యించారు. ఆమె చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు నిందితుల‌ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News