: నిర్మాత ఏక్తాకపూర్ నివాసంలో భారీ ఎత్తున ఐటీ సోదాలు


బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ నివాసం, కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచీ ఆదాయపు పన్ను అధికారులు అనూహ్య సోదాలు నిర్వహిస్తున్నారు. తండ్రి, నటుడు జితేంద్ర స్థాపించిన బాలాజీ టెలిఫిలిమ్స్ సంస్థ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీరియళ్లు నిర్మిస్తోంది. ఏక్తా భారీ స్థాయిలో నిర్మించిన 'షూట్ అవుట్ ఎట్ వాదాలా' చిత్రం వచ్చేవారంలో విడుదలవబోతుంది. ఈ నేపథ్యంలో 100 మంది ఐటి అధికారులు ముంబయి జూహూలోని కపూర్ నివాసం, అంధేరీలోని బాలాజీ టెలిఫిలిమ్స్ సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు జరుపుతున్నారు. నిర్మాత ఏక్తా పన్నుఎగవేతకు పాల్పడిన నేపథ్యంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News