: ముగ్గురు దౌత్య అధికారులను వెలివేసిన పాకిస్థాన్
గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ముగ్గురు భారతీయ దౌత్యవేత్తలను ఈ రోజు పాకిస్థాన్ వెలివేసింది. దీంతో వారు ముగ్గురూ ఇస్లామాబాద్ నుంచి భారత్ బయలుదేరారు. అండర్ కవర్ ఏజెంట్లయిన విజయ్ కుమార్ వర్మ, మాధవన్ నందా కుమార్, అనురాగ్ సింగ్ లు దుబాయ్ ఎయిర్ లైన్స్ ద్వారా పాక్ విడిచి వెళ్లారని ఆ దేశం ప్రకటించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లతో 8 మంది భారత దౌత్య అధికారులు పనిచేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీస్ జకారియా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు, మిగిలిన అధికారులు కూడా వాఘా సరిహద్దు ద్వారా భారత్ కు వస్తున్నారు.