: రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని భార్యను హతమార్చిన కసాయి
మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి అందుకు భార్య అంగీకరించని కారణంగా ఆమెను హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మీడియాకు వివరాలు వెల్లడించారు. బోత్రా గ్రామానికి చెందిన కునాల్సోనక్ ఖడ్కేకు భార్య ఇందు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, అయితే తనకు కొడుకు కావాలని కునాల్ మరో మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. తన భర్త రెండో పెళ్లికి ఆమె ఒప్పుకోకపోవడంతో తన భార్యను హతమార్చాలనుకున్న నిందితుడు నిన్న రాత్రి ఆమెను గ్రామ శివారులోని నది వద్దకు బండిమీద తీసుకెళ్లి, గొంతు నులిమి హత్యచేశాడని పేర్కొన్నారు. తదుపరి తన భార్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడని పోలీసులు అన్నారు. అయితే, ఇందు తండ్రికి తన అల్లుడు కునాల్సోనక్ మీద అనుమానం రావడంతో ఫిర్యాదు చేశాడని, దీంతో తమ దర్యాప్తులో కునాల్ తన భార్యను హతమార్చినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.