: పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక మలుపు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ


తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి జరిగిన ఫిరాయింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ విషయంలో వేసిన పిటిష‌న్‌ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వ‌చ్చింది. పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం కాంగ్రెస్ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించేలా స్పీక‌ర్‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని ఈ పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని త‌మ‌కు విశ్వాసం లేద‌ని ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. తాము ప్రాథ‌మికంగా ఈ విష‌యంలో పిటిష‌న‌ర్ వాద‌న‌ల‌తో ఏకీభ‌విస్తున్నామ‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News