: పిల్లల విషయంలో ఓ అంగీకారానికి వచ్చిన ఏంజెలినా జోలి, బ్రాడ్ పిట్
12 ఏళ్ల పాటు కలసి జీవించిన హాలీవుడ్ స్టార్స్ ఏంజెలినా జోలి, బ్రాడ్ పిట్ లు విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లలు ఎవరివద్ద ఉండాలనే విషయంపై ఇప్పటిదాకా సందిగ్ధత నెలకొంది. పిల్లలంతా తనవద్దే ఉండాలని తొలుత జోలీ వాదించింది. ఆ అవకాశం తనకు కూడా కావాలని బ్రాడ్ పిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు. ఆరుగురు పిల్లలను జోలీ వద్దే ఉంచడానికి బ్రాడ్ పిట్ అంగీకరించాడు. బ్రాడ్ పిట్ ను పిల్లలు అప్పుడప్పుడు కలిసేందుకు ఏంజెలినా అంగీకరించింది. అంతేకాదు, తండ్రిని పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూడవచ్చని... తాను అభ్యంతరం చెప్పనని తెలిపింది. పిల్లల సంరక్షణ నిపుణుల ఆధ్వర్యంలో వీరిద్దరూ ఈ మేరకు అంగీకరించారు. అంతేకాదు, ఒప్పంద పత్రంపై ఇద్దరూ సంతకాలు చేశారు.