: స్నేహితుడితో బైక్ పై వెళ్తున్న విద్యార్థినిని ప్రశ్నించిన పోలీసులు.. కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలులోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలోని వసతి గృహంలో బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నాగలక్ష్మి అనే విద్యార్థిని నిన్న తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళుతుండగా దారిలో అడ్డుకున్న పోలీసులు వారిని గురించి ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో నిన్న రాత్రి వసతిగృహంలోకి చేరుకున్న నాగలక్ష్మి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సదరు విద్యార్థిని పొదిలి మండలం తల్లమల్లకు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.