: ట్రంప్, హిల్లరీలలో ఏయే సెలబ్రిటీలు ఎవరెవరికి మద్దతిస్తున్నారు?.. ఓ లుక్కేద్దాం!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు మధ్యాహ్నంకల్లా ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. విజయం కోసం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డొమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ లు తమ యావత్ శక్తియుక్తులను ధారపోశారు. అగ్రదేశాధినేతను ఎన్నుకునే ఎన్నికలు కావడంతో... ప్రపంచం యావత్తూ దీనిపై ఫోకస్ చేసింది. దేశాలు, దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజానీకానికే కాదు... ఉగ్రవాద సంస్థలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. ట్రంప్ గెలిస్తే ఇస్లామిక్ టెర్రరిజంపై ఉక్కుపాదం మోపే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. మరోవైపు, పలువురు అమెరికన్ సెలబ్రిటీలు కూడా తమకు ఇష్టమైన నేతకు మద్దతు పలికారు. పలానా అభ్యర్థిని గెలిపించాలంటూ బహిరంగంగా కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఏయే సెలబ్రిటీలు ఎవరికి మద్దతు పలుకుతున్నారో ఓ లుక్కేద్దాం. హిల్లరీ క్లింటన్ కు మద్దతు పలుకుతున్న సెలబ్రిటీలు: హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ, అతని భార్య పాప్ స్టార్ కేటీ పెర్రీ శృంగార నటి, సింగర్ మడొన్నా హాలీవుడ్ అందాల నటి డ్రూ బారీమోర్ నటుడు రాబర్ట్ డినీరో అమెరికర్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ నటి సిగౌర్నీ వీవర్ సీనియర్ యాక్ట్రెస్ మెరిల్ స్ట్రీప్ సింగర్ లేడీ గాగా నటి, చాట్ షో హోస్టెస్ ఎల్లెన్ డిజెనెరస్ నటి, సింగర్ మిలీ సైరస్ సింగర్ ఎల్టన్ జాన్ సింగర్ ఎల్లీ గౌల్డింగ్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు: బిగ్ బ్రదర్ స్టార్, బాస్కెట్ బాల్ మాజీ ప్లేయర్ డెన్నిస్ రాడ్మన్ రాక్ స్టార్ కిడ్ రాక్ రెజ్లర్ హల్క్ హోగన్ సింగర్ అజీలియా బ్యాంక్స్ హెవీ వెయిట్ బాక్సింగ్ దిగ్గజం మైక్ 'ఐరన్' టైసన్ మూవీ స్టార్ క్లింట్ ఈస్ట్ వుడ్ మూవీ స్టార్ చార్లీ షీన్ ఆస్కార్ విన్నర్, నటి ఏంజెలినా జోలీ తండ్రి జాన్ వాయిట్ నటుడు, బిగ్ బ్రదర్ స్టార్ గ్యారీ బుసే అమెరికన్ ఫుట్ బాల్ స్టార్ టామ్ బ్రాడీ నటి కిర్స్టీ అల్లీ.