: ఢిల్లీ రోడ్లపై దుమ్ము.. తొలగించేందుకు 25 లక్షల నీటిని కుమ్మరించిన అధికారులు
దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాలుష్య భూతం కోరలు చాస్తుండడంతో జనాలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు వెళ్లేందుకు రక్షణ చర్యలు తీసుకని మరీ రోడ్డెక్కుతున్నారు. కాలుష్యం ధాటికి ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ రోడ్లపై పేరుకుపోయిన దుమ్మును తొలగించేందుకు సోమవారం ఏకంగా 25 లక్షల నీటిని ఉపయోగించారు. వాయు కాలుష్యానికి దుమ్ము కూడా ఓ కారణం కావడంతో దానిని తొలగించేందుకు నీటితో రోడ్లను శుభ్రం చేశారు. ఇందుకోసం ప్రజా పనుల అధికారులు 250 ట్యాంకర్లను ఉపయోగించారు. నగరంలోని రోడ్లపై నీటిని స్ప్రే చేసి శుభ్రం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే రోడ్లపై పేరుకుపోయిన దుమ్మును తొలగించేందుకు నీటిని స్ప్రే చేసినట్టు అధికారులు తెలిపారు.