: కొన్ని గంటలు ఆగండి... మీడియా ఆశ్చర్యపోతుంది: ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు మీడియా నుంచి ఎంతమాత్రమూ మద్దతు లేనప్పటికీ, మీడియా సహా పోల్ సంస్థలన్నీ ఆశ్చర్యపోయేలా ఫలితాలు ఉండబోతున్నాయని రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న ట్రంప్ వ్యాఖ్యానించారు. మరికొన్ని గంటల్లో ఎన్నికలు ప్రారంభం కానుండగా, చివరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిచిగాన్ లో ఆయన మాట్లాడారు. వైట్ హౌస్ లో తాను కాలుపెట్టనున్నానని, స్వింగ్ రాష్ట్రాలన్నింటిలో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారని అన్నారు. కొలరాడోలో గెలిచేది తానేనని, నెవాడాలో పరిస్థితి బాగుందని, నార్త్ కరోలినా, వర్జీనియాల్లో పార్టీ పుంజుకుందని, ఫ్లోరిడా సైతం మనదేనని అన్నారు. చివరి రెండు రోజుల ప్రచారంలో భాగంగా అటు ట్రంప్, ఇటు హిల్లరీలు స్వింగ్ రాష్ట్రాలైన అయోవా, మిన్నియాపోలిస్, కొలరాడో, మిచిగాన్, పెన్సిల్వేనియా, న్యూ హ్యాంప్ షైర్, ఓహాయో రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు.

  • Loading...

More Telugu News