: జనచైతన్య యాత్రలో మూడువారాలు పాల్గొంటా: లోకేష్


ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న టీడీపీ జనచైతన్య యాత్రలో మూడు వారాల పాటు పాల్గొంటానని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో జరగనున్న జనచైతన్య యాత్రలో పాల్గొంటానని అన్నారు. రేపటి నుంచి తన జనచైతన్య యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. రాజకీయం వేరు, వ్యాపారం వేరని ఆయన స్పష్టం చేశారు. తమ హెరిటేజ్ 25 ఏళ్ల క్రితం స్థాపించిన సంస్థ అని ఆయన తెలిపారు. అదే ప్రతిపక్ష నేత జగన్ సాక్షి పేపర్ పెట్టకముందే షేర్లు అమ్ముకున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. బ్లాక్‌ మార్కెట్‌ ఏలా చేయాలో జగన్‌ ను చూసి నేర్చుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News