: ఎన్నికల చట్టాల్లోని లొసుగులే వారిని కాపాడుతున్నాయి


క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలకు ఎందుకు ఆలస్యమవుతోందని ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేల తక్షణ చర్యలకు ఉన్న ఆటంకాలపై కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో దోషులుగా తేలిన ఎమ్మెల్యే, ఎంపీలు తక్షణ అనర్హతకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఎన్నికల చట్టాల్లోని లొసుగులు వారిపై తక్షణ అనర్హత వేటుకు (చర్యలకు) ఆటంకంగా మారుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీల ప్రధాన కార్యదర్శులు క్రిమినల్ కేసులున్న చట్టసభ్యులకు అనర్హత నోటీసులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని న్యాయస్థానానికి చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అఫిడవిట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News