: పదిహేనురోజుల్లోపే జయలలిత ఇంటికి?
పదిహేనురోజుల్లోపే ఆసుపత్రి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అన్నా డీఎంకే నేత అధికార ప్రతినిధి సి.పొన్నయన్ మాట్లాడుతూ, ‘అమ్మ’ జయలలిత ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఆమెకు ఫిజియో ధెరపీ చికిత్స అందిస్తున్నారని చెప్పారు. జయలలిత సంపూర్ణ ఆరోగ్యం పొందిన తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని అన్నారు. ప్రస్తుతం జయలలిత కూర్చోగల్గుతున్నారని, ఎటువంటి పరికరాల సాయం లేకుండానే ఆమె శ్వాస తీసుకోగల్గుతున్నారని, సెమీ-సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నారని చెప్పారు. కాగా, జ్వరం, ఇన్ ఫెక్షన్ కారణంగా జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.