: ఇషాంత్ మంచి బౌలరే కానీ, ఆ విషయంలో విఫలమవుతున్నాడు: కపిల్ దేవ్
ఇషాంత్ శర్మ మంచి బౌలరే అయినప్పటికీ, వికెట్టు పడగొట్టే విషయంలో ఎందుకో విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. మంచి హైట్ కారణంగా ఇషాంత్ కు వేగంగా బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంటుందని, అయితే, వికెట్లు పడగొట్టే బంతులను మాత్రం వేయలేకపోతున్నాడని, నిలకడైన బౌలింగ్ కు అతను కృషి చేయాల్సిన అవసరముందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. కాగా, న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఆడలేకపోయిన ఇషాంత్, ఇంగ్లాండుపై జరగనున్న టెస్టు సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు.