: 2000 రూపాయల నోటు ఎలా ఉంటుందో తెలుసా?


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెండు వేల రూపాయల నోటును విడుదల చేయనుందంటూ సోషల్‌ మీడియాలో ఒక కరెన్సీ నోటు ఫోటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోల ప్రకారం ఆర్బీఐ విడుదల చేయనున్న రెండు వేల రూపాయల నోటు గులాబీ, తెలుపురంగుల్లో ఉండనుంది. ఈ నోట్లను మైసూర్‌ లోని కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌ లో ముద్రించారని, ఇవి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంటూ గత నెల 21న ‘ద హిందూ బిజినెస్‌ లైన్‌’ ప్రచురించిన కథనాన్ని పేర్కొంటూ ఈ ఫోటోలు షేర్ అవుతున్నాయి. అయితే ఈ రెండు వేల రూపాయల నోట్ల గురించి కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం. అయితే చాలా మందికి ఇది వాస్తవమా? అవాస్తవమా? అన్నది తెలియక, ఆర్బీఐ ధ్రువీకరించక గందరగోళానికి గురవుతున్నారు. ప్రధానంగా ఈ ఫోటోలు ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో సర్క్యులర్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News