: మోదీని తిట్టకపోతే అంగీకరించమని టీడీపీ వాళ్లే చెబుతున్నారు: వైఎస్సార్సీపీ నేత భూమన


ప్రధాని నరేంద్ర మోదీని తిట్టకపోతే తాము అంగీకరించే పరిస్థితుల్లో లేమని టీడీపీ వాళ్లు స్పష్టంగా చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేక పోయారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే..ఈరోజు ఉదయం స్నానం కూడా చేయకుండా పత్రికా సమావేశం పెట్టినాయన ఏమి మాట్లాడరంటే.. మోదీ గురించి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అయినా విమర్శించలేదే అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. బీజేపీ వారు, మీరు, చాలా జాగ్రత్తగా వినండి .. మోదీ గారిని తిట్టకపోతే అంగీకరించే పరిస్థితుల్లో టీడీపీ లేదని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే .. మోదీని కాదు కదా ఎవ్వరినైనా సరే నడిరోడ్డుపై నిలబెట్టి బట్టలూడదీసి ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి సాధిస్తారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News