: ముషారఫ్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్య కేసులో మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఇస్లామాబాద్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో 'జాయింట్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్' ను తిరిగి నెలకొల్పాలని ముషారఫ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2007లో ఓ ర్యాలీలో పాల్గొన్న భుట్టో హత్యకు గురైనప్పుడు ముషారఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో ఈ మాజీ అధ్యక్షుడు ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ముషారఫ్ అతని ఫామ్ హౌస్ లోనే జుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.