: భారత్ కు జీవితాంతం గుర్తుండిపోయేలా సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం: హఫీజ్ సయీద్


భారత్ జీవితాంతం గుర్తుంచుకునేలా సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. కాశ్మీరీ మిలిటెంట్లతో జమ్మూ కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని, ఇప్పుడు తమ వంతు వచ్చిందని అన్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తాను ఏమి చేయాలనుకున్నాడో అది చేశాడని, ఇప్పుడు కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేయాల్సిన వంతు తమదని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని మిర్ పుర్ లో నిన్న నిర్వహించిన ఒక ర్యాలీలో హఫీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, పీఓకే లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం పాకిస్థాన్ ఆర్మీ కూడా ఇదే తరహా దాడులను భారత్ పై పాక్ ఆర్మీ చేస్తుందంటూ సయీద్ ఒక ప్రకటన చేశాడు. అయితే, పాక్ ఆర్మీ పేరిట సయీద్ ఈ ప్రకటన చేయడం వివాదాస్పదమైన విషయం విదితమే. తాజాగా, కాశ్మీరీ మిలిటెంట్లతో సర్జికల్ స్ట్రయిక్స్ చేయిస్తామంటూ సయీద్ హెచ్చరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News