: సీఎం కేసీఆర్‌పై రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ ఎన్నికల కమిషన్‌కు టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఈ రోజు ఫిర్యాదు చేశారు. ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన ఆయన అందులో తెలంగాణలో ఇటీవల జరిగిన కొత్త జిల్లాలు, మండలాలు, రెవన్యూ డివిజన్ల ఏర్పాటు సరిగా చేయలేదని తెలిపారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ ఎన్నికల కమిషన్‌కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు.