: కన్నడ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో విషాదం.. చెరువులో పడి ఇద్దరు నటుల మృతి
కన్నడ సినిమా ‘మాస్తిగుడి’ క్లైమాక్స్ షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. 'మాస్తిగుడి' చిత్రంలో దునియా విజయ్ హీరోగా నటిస్తుండగా, అనిల్, ఉదయ్ అనే ఇద్దరు నటులు విలన్లుగా నటిస్తున్నారు. బెంగళూరులోని ఒక రిజర్వాయర్ వద్ద క్లైమాక్స్ షూటింగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా హెలికాఫ్టర్ నుంచి ముగ్గురు నటులు చెరువులోకి దూకారు. అయితే, ఈ సంఘటనలో హీరో విజయ్ సురక్షితంగా బయటపడగా, ఉదయ్, అనిల్ మాత్రం మృతి చెందారు.