: హాలీవుడ్ లో జోరందుకున్న ముందస్తు ఓటింగ్
అమెరికాలో అత్యంత సంపన్న ప్రాంతమైన హాలీవుడ్ నగరం లాస్ ఏంజెలెస్ లో ముందస్తు ఓటింగ్ జోరందుకుంది. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లాస్ ఏంజెలెస్ లో ముందస్తు ఓటింగ్ కోసం 12 చోట్ల పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. ఎన్నికల రోజైన రేపు రద్దీ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో... చాలా మంది తమ ఓటును ముందుగానే వేస్తున్నారు. మరోవైపు కాలిఫోర్నియా రాష్ట్రంలో సుమారు కోటి 90 లక్షల మంది ముందస్తు ఓటు కోసం రిజిస్టర్ చేసుకున్నారు.