: దీపిక డ్రెస్ అసహ్యంగా ఉందంటూ బ్రిటిష్ పత్రిక విమర్శలు


బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకు డ్రెస్ సెన్స్ లేదంటూ బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్ విమర్శించింది. నెదర్లాండ్స్ లోని రాటర్ డ్యామ్ లో నిన్న రాత్రి జరిగిన ఎంటీవీ యూరోపియన్ మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్ కు దీపికా పదుకొనే హాజరైంది. ఈ కార్యక్రమానికి ఆమె ధరించి వచ్చిన డ్రెస్సు చాలా అసహ్యంగా ఉందంటూ ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది. అంతేకాకుండా, ‘బాలీవుడ్ బ్లండర్’ దీపికాపదుకొనే అంటూ రాసుకొచ్చింది. కాగా, మరోపక్క ‘దీపికా పదుకొనే ధరించిన డ్రెస్సు సూపర్’, ‘దీపికా పదుకొనేలా రెడ్ కార్పెట్ పై నడవాలన్నదే నా కోరిక ’, ‘అవర్ క్వీన్’, ‘కోట్లాది మంది నిన్ను అభిమానిస్తున్నారు’ అంటూ దీపికను ప్రశంసిస్తూ పలు ట్వీట్లు వచ్చాయి.

  • Loading...

More Telugu News