: అక్షయ్ కుమార్ మళ్లీ తన ప్రత్యేకత చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మహిళలు అత్యాచారాల సమయంలో తమని తాము కాపాడుకోవడానికి దేశంలోని వివిధ పట్టణాల్లోని విద్యార్థినులకు తన మార్షల్ ఆర్ట్స్ స్కూల్ తరపున ఉచిత ఆత్మరక్షణ టెక్నిక్స్ తో పాటు, మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటికే శిక్షణ ఇప్పిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఈ మధ్యే వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు కొంత మొత్తం అందజేసి ఆదుకున్నాడు కూడా. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని రైతులకు సాయపడడానికి ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మున్ గంటివర్ ను అక్షయ్ కలిశాడు. ఈ సందర్భంగా విదర్భ ప్రాంతంలోని రైతుల దుస్థితిని మంత్రి అక్షయ్ కు వివరించారు. దీంతో ఆ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి అక్షయ్ నిర్ణయించుకున్నాడు. యావత్మల్ జిల్లాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామం సమాచారం తనకు అందించాలని అక్షయ్ కోరినట్టు, ఈ మేరకు పింప్రి బుట్టి గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ నివేదిక పంపుతున్నామని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News