: నిఖిల్ రెడ్డి బాధ్యత తీసుకుంటాము: గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు


రెండంగుళాల ఎత్తు కోసం కాళ్లు నరికించుకున్న నిఖిల్ రెడ్డి పట్ల అమానుషంగా ప్రవర్తించిన హైదరాబాదు, గ్లోబల్ ఆసుపత్రి ఈ విషయంలో తాజాగా స్పందించింది. తమ ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగుల ఆరోగ్యం కోసం తాము శ్రద్ధ కనబరుస్తామని, అందులో భాగంగా నిఖిల్ రెడ్డి బాధ్యతను కూడా తాము తీసుకుంటామని ఆసుపత్రికి చెందిన సిబ్బంది తెలిపారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపడతామని వారు తెలిపారు. దీనిపై నిఖిల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పెషలిస్టు వైద్యులు తనను చూడడం లేదని, కేవలం డ్రెస్సింగ్ మాత్రమే చేస్తున్నారని ఆయన తెలిపారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తనకోసం ప్రత్యేకవైద్యుడ్ని నియమించాలని ఆయన కోరారు. రెండు రోజుల క్రితం తన తండ్రి ఆసుపత్రికి ఫోన్ చేయగా, వైద్యుడ్ని మీ కారణంగా సస్పెండ్ చేశారు కనుక, తామేమీ చేయలేమని చేతులెత్తేశారని, వివాదం మీడియాకు చేరడంతో తమ వద్దకు స్పైనల్ స్పెషలిస్టును పంపారని, వాస్తవానికి బోన్ స్పెషలిస్టు దీనిపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలుగుతారని తాము భావిస్తున్నామని, ఆసుపత్రి ఆ విధమైన చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News