: ఫొటో దిగినంత మాత్రాన ఆమెతో సంబంధం ఉన్నట్టేనా?: అర్భాజ్ ఖాన్


తన భార్య మలైకా అరోరా స్నేహితురాలు యెల్లో మెహ్రాతో తనకు ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలను సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తోసిపుచ్చాడు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని మండిపడ్డాడు. తన సినిమాల గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉందని... కానీ, వ్యక్తిగత జీవితం వేరని అన్నాడు. ఇష్టమొచ్చినట్టు రాతలు రాస్తూ, తమ మనోభావాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ఉండబట్టి, తమ గొంతుకను వినిపించే అవకాశం తమకు దక్కిందని చెప్పారు. యెల్లో మెహ్రా తనకు స్నేహితురాలు మాత్రమే అని... ఆమెతో కలసి ఫోటో దిగితే తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేస్తారా? అని అర్భాజ్ మండిపడ్డాడు. 50 మందితో ఫొటో దిగితే... వారందరితో సంబంధాలు అంటగడతారా? అని ప్రశ్నించాడు. మెహ్రాను ప్రమోట్ చేసేందుకే ఒక స్నేహితుడిగా ఆమెతో ఫొటో దిగానని చెప్పాడు. ఆమెతో తనకు ఎఫైర్ ఉంటే... ఆమెతో దిగిన ఫొటోలను ఎందుకు బయటపెడతానని ప్రశ్నించాడు. మరోవైపు, గత కొంత కాలంగా మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ లు విడివిడిగా ఉంటున్నారు.

  • Loading...

More Telugu News