: నయీమ్ కేసు: విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డిని ప్రశ్నించిన సిట్
ఇటీవల తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు నయీమ్ కేసులో సంబంధమున్న అందరినీ విచారిస్తున్నారు. సిట్ అదనపు ఎస్పీ సాయికృష్ణ సమక్షంలో ఈ రోజు హైదరాబాదు, నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డిని ప్రశ్నించారు. రవీందర్‌రెడ్డి గతంలో భువనగిరి, నల్గొండ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో నయీమ్ ముఠా ఆయా ప్రాంతాల్లో అనేక అక్రమాలు చేసింది.