: ఇకపై శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు... కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


ప్రముఖ ఆలయం శబరిమలలోకి మహిళల ప్రవేశానికి కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శబరిమల గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ మహిళా సంఘాలు ఆందోళన జరుపుతున్న విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం తాజా ప్రకటనతో ఇకపై శబరిమల గర్భాలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం సుగమమైంది.

  • Loading...

More Telugu News