: ప్రియమైన నాన్నకు హ్యాపీ బర్త్‌డే: శ్రుతి హాసన్


త‌న‌కే సాధ్య‌మైన‌ విలక్ష‌ణ న‌ట‌న‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న కమల హాసన్ ఈరోజు 62వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు త‌న కుమార్తె శ్రుతిహాస‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ‘ప్రియమైన నాన్నకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు’ అని ట్వీట్ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో త‌న పుట్టిన రోజు వేడుకలను నిర్వహించకూడ‌ద‌ని కమలహాస‌న్ ఇటీవ‌లే ట్విట్ట‌ర్ ద్వారా తన అభిమానులను కోరారు. దీంతో ఆయ‌న అభిమానులు పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం క‌మ‌ల‌హాస‌న్ ‘శభాష్‌ నాయుడు’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News