: సొంత గడ్డపై ఆస్ట్రేలియా చిత్తు... సత్తా చాటిన సఫారీలు
సఫారీల జైత్ర యాత్ర కొనసాగుతోంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా... ఆసీస్ గడ్డపై కూడా చెలరేగిపోయింది. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 177 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 539 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ బ్యాట్స్ మెన్ కేవలం 361 పరుగులకే చేతులెత్తేశారు. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసిన ఆసీస్... చివరి రోజు కేవలం 192 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5 వికెట్లు, డుమిని, మహరాజ్, బావుమా, ఫిలాండర్ లు చెరో వికెట్ తీశారు. చివరి రోజున ఖవాజా (97), నెవిల్ (60)లు పోరాడినా తమ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రబాడా ఎంపికయ్యాడు. స్కోరు వివరాలు... దక్షిణాఫ్రికా 242 & 540 / 8 డిక్లేర్ ఆస్ట్రేలియా 244 & 361