: మహిళా వేషధారణలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట బంగి అనంతయ్య ప్రదర్శన
వినూత్నంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ నిరసనలు తెలపడంలో పేరుపొందిన కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు నిధులు విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహిళా వేషధారణలో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోని డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు రూ.42 వేల కోట్లు రుణమాఫీ చేశారని ఆయన కొనియాడారు.