: ఎన్టీఆర్ కుమారుడు కాకుండా అల్లుడు సీఎం అయ్యాడు.. కేటీఆర్ సీఎం కాకుండా హరీశ్ అవుతాడేమోననే కేసీఆర్ భయం: జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఈ రోజు టీపీసీసీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేసీఆర్ చేపడుతున్న కొత్త సచివాలయ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపారు. కొత్త సచివాలయాన్ని నిర్మించకూడదని విన్నవించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాస్తుని కారణంగా చూపిస్తూ దురుద్దేశంతోనే తెలంగాణ సర్కారు సచివాలయ భవనాల్ని కూలగొడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆ సచివాలయంలో పాలన కొనసాగిస్తే సీఎంల కుమారులు మళ్లీ సీఎంలు కావడం లేదని కేసీఆర్ అనుమానపడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుమారుడు కాకుండా అల్లుడు చంద్రబాబు సీఎం అయ్యాడని, ఇప్పుడు కేటీఆర్ సీఎం కాకుండా హరీశ్‌రావు సీఎం అవుతాడనే కేసీఆర్ భయపడుతున్నారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే సచివాలయాన్ని కూలగొడుతున్నారని అన్నారు.